calender_icon.png 28 November, 2024 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం

26-09-2024 01:51:42 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): అధికారులు సమన్వయంతో పనిచేయడంతో నగరంలో బోనా లు, గణేశ్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ వేడుకలను విజయవంతంగా నిర్వహించగలిగామ ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం నగరంలోని గోల్కొండ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఉత్సవాల సక్సెస్ మీట్  2024 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

నగరంలో బోనాలు, గణేశ్ ఉత్సవాలు, మిలాద్ వేడుకలు విజయవంతం అయ్యాయని తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే విధం గా పనిచేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని మరింత పెంచాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందన్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు నష్టం కలుగకుండా పునరావాసం, ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్‌మాన్, ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.