16-04-2025 12:24:40 AM
జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రామానుజరెడ్డి
ముషీరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): ప్రజల సంపూర్ణ సహకారంతోనే ఇటీవల జరిగిన రంజాన్ పండుగ శ్రీరామనవమి, హనుమాన్ శోభాయాత్రలు ప్రశాం తంగా జరిగాయని జీహెచ్‌ఎంసీ సర్కిల్-15 డిప్యూటీ మున్సిపల్ కమీషనర్ రామానుజరెడ్డి అన్నారు. మం గళవారం భోలక్ పూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వాజీద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డీఎంసీ, అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్ చంద్రలను కలిసి సన్మానించారు.
నెల రోజుల పాటు రంజాన్ మాసంలో 24 గంటలు పనిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నందుకు అధికారు లను అభినందిస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా డీఎంసీ రామానుజ రెడ్డి మాట్లాడుతూ... జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేశారని పేర్కొన్నారు.
ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించామని, స్థానిక జీహెచ్‌ఎంసీ సిబ్బంది బాగా కష్టపడి పనిచేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహ్మద్ రహీం ఉద్దీన్, చాందఖాన్, యూసూఫ్, అబ్దుల్ లతీఫ్, మహ్మద్ మసూద్ తదితరులు పాల్గొన్నారు.