ఆవిష్కరించిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, జనవరి 19 (విజయ క్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్ట పైన ‘శ్రీ పండుగ సాయన్న విగ్రహా ఆవిష్కరణ‘ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ కొండా విశ్వేశ్వరర్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..
పండగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. పండగ సాయన్న జీవితాన్ని ఆదర్శనంగా తీసుకోవాలని, అన్యాయం ఎక్కడ జరిగిన ఎదురించే తత్వం కలిగి ఉండాలని, పండగ సాయన్న జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా అందించా లన్నారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, బీజేపీ నేతలు, ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.