సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): డిమాండ్‌కు సరిపడ ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా, ప్రణాళిక ప్రకారం జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మార్క్‌ఫెడ్, హాకా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్క్‌ఫెడ్ ద్వారా 79 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను నిర్మించామని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. అవసరమైన చోట గోదాములపై సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, హాకా ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.