calender_icon.png 5 April, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం గుర్తించిన ఎరువులు విత్తనాలనే వినియోగించాలి

05-04-2025 12:41:46 AM

దళారీ వ్యవస్థపై రైతులకు వివరించాలి జిల్లా న్యాయమూర్తి డీ రమేష్‌బాబు

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 4 (విజయ క్రాంతి) బూతలిని నమ్ముకొని వ్యవసాయ ఆధారమే బ్రతుకుతున్న రైతులకు దళారీ వ్యవస్థ పట్ల సంపూర్ణ అవగాహన కల్పిస్తూ ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవాలని నాగర్కర్నూల్ జిల్లా జడ్జి డి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఐసిఎఫ్‌ఐ లా స్కూల్, హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా మెడికల్ కళాశాల,  పాలెం అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆడిటోరియంలో వేర్వేరుగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మెడికల్ కళాశాలలో ర్యాగింగ్, మెడికల్ ఎథిక్స్, లా పై న్యాయపరమైన అవగాహన, మెడికల్ లీగల్ సమస్యల యొక్క ప్రాముఖ్యత, నేర పరిశోధనలో మెడికల్ సర్టిఫికెట్ల పాత్రపై అవగాహన కల్పించారు. పరిమితికి మించి పెస్టిసైడ్స్ ఎరువులు వంటివి వాడటం వల్ల భూసాంద్రత దెబ్బతిని పంటల దిగుబడిపై ప్రభావం చూపుతోందని ప్రభుత్వం గుర్తించిన ఎరువులు విత్తనాలనే వినియోగించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

భారతదేశం రైతు ఆధారిత దేశంగా పేరొందని ఆ రైతులు పంటల దిగుబడి విషయంలో నష్టపోకుండా నేటి వ్యవసాయ అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సిన బాధ్యత ఉందన్నారు. వారితోపాటు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సబిత, ఐసిఎఫ్‌ఏఐ. లా స్కూల్ ఐఎఫ్ హెచ్‌ఇ. హైదరాబాద్ కు చెందిన ఐశ్వర్యా రెడ్డి పాలెం అగ్రికల్చర్ యూనివారసిటీ ప్రొఫెసర్స్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.