17-04-2025 03:39:31 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఎరువుల దుకాణాలను, మల్లూరు సహకార సంఘ పరిధిలోని ఎరువుల విక్రయ కేంద్రాలను గురువారం బిచ్కుంద డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు అమీనా బి నిజాంసాగర్ మండలంలోనీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల దుకాణాలు, గాయత్రి చక్కెర కర్మాగారంలో ఉన్న ఎరువుల గోదాము తనిఖీ చేశారు. యూరియా ఇతర ఎరువుల నిల్వలు, నిల్వ పట్టికలు నిల్వ రిజిస్టర్ లు పరిశీలించారు. ఆధార్ కార్డు తీసుకుని వచ్చిన రైతులకు ఈపాస్ యంత్రం ద్వారా అవసరమైన ఎరువులు విక్రయించాలని ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, ఏఈ ఓ సాగర్, సీఈఓ సాయిలు, వ్యాపారులు, పాల్గొన్నారు.