ముంబై,(విజయక్రాంతి): ముంబై తీరంలో ఓ ఫెర్రీ బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగరికి పరిస్థితి విషమంగా ఉంది. ముంబై సమీపంలోని ఫెర్రీ గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఫెర్రీలో సిబ్బంది సహ 85 మంది ఉన్నట్లు గుర్తించారు. ఫెర్రీలో ఉన్న 80 మందిని సహయక సిబ్బంది రక్షించగా, మరో ఐదురుగు పర్యాటకులు గల్లంతయ్యారు.
రక్షించిన వారిలో ఆరుగురికి అస్వస్థత ఏర్పాడడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారని, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఫెర్రీని స్పీడ్ బోట్ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, కోస్ట్ గార్డ్, మత్స్యకారుల సహాయంతో సహాయక చర్యలు కొనసాగించినట్లు అధికారి వెల్లడించారు.