calender_icon.png 24 November, 2024 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిపూర్‌లో మేఠి

24-11-2024 03:28:23 AM


న్యూఢిల్లీ, నవంబర్ 23: మణిపూర్‌లో మేఠి, కుకీ తెగల మధ్య మరోసారి హింస చెలరేగిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. మరో 20వేల మంది పారామిలిటరీ బలగాలను రాష్ట్రానికి పంపించింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష అనంతరం 50వేల మంది పారామిలిటరీ సిబ్బందిని మణిపూర్‌కు పంపించామని.
అదనంగా మరో 20వేల మంది బలగాలను శనివారం మణిపూర్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. దీంతో గత 10రోజుల వ్యవధిలో మొత్తంగా 90వేల మంది అదనపు పారామిలిటరీ

బలగాలను తరలించినట్లుంది. హింస చెలరేగిన ప్రాంతాలతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో ఈ బలగాలను మొహరించారు. మరోవైపు మణిపూర్ భద్రతపై శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీ ప్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసు, ఆర్మీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మహిళ సజీవ దహనంతో..
నవంబర్ 7న జిరిబామ్ జిల్లా జైరాన్‌లో కుకీ తెగకు చెందిన ఓ మహిళను మరో వర్గం వారు సజీవ దహనం చేయడంతో మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగిని విషయం తెలిసిందే. నవంబర్ 7 నుంచి 18వరకు ఒక్క జిరిబామ్ జిల్లాలోనే కనీసం 20 మంది మరణించారు. ఇక్కడ మేఠీ, కుకీ తెగల మధ్య పచ్చగడ్డి వేస్తే మండేలా పరిస్థితి ఉంది. ఒకవర్గం మరోవర్గంపై పరస్పరం దాడులకు దిగుతున్నాయి. పరిస్థితి మరింత చేయిదాటకముందే అదనపు బలగాలను కేంద్రం ఇక్కడ మోహరిస్తోంది.