calender_icon.png 28 November, 2024 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమిళనాడువైపు దూసుకొస్తున్న ‘ఫెంగల్’

28-11-2024 04:04:49 AM

ఏపీలోనూ భారీ వర్షాలు పడే చాన్స్

చెన్నై, నవంబర్ 27: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధ వారం తీవ్ర తుఫానుగా మారి తమిళనాడువైపు దూసుకొస్తోంది. మరో రెండు రోజుల్లో తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని   భారత వాతావరణశాఖ ప్రకటించింది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కదులుతు న్నట్టు కదులుతున్నట్టు పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ‘ఫెంగల్ తుఫానుగా సౌదీ అరేబియా నామకరణం చేసింది.

ఫెగంల్ తుఫాను ప్రభావంతో బుధ, గురు వారాల్లో తమిళనాడులోని మూడు జిల్లాలు సహా పుదుచ్చేరిలోని కారైకల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో సైతం తుఫాను ప్రభావం ఉంటుందని పేర్కొంది. తుఫాను కారణంగా గురువారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు కురవనున్నట్టు చెప్పింది. తుఫాను నవంబర్ 29న తీరం దాటనుందని తెలిపింది. తుఫా ను ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.