16-02-2025 10:13:31 AM
అమరావతి: గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (Guntur Government General Hospital)లో లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆసుపత్రిలో డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ శిక్షణ పొందుతున్న మహిళా విద్యార్థులు బ్లడ్ బ్యాంక్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి అనుచితంగా ప్రవర్తించాడని, వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.
బాధిత విద్యార్థులు అధికారికంగా గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్(Principal of Guntur Medical College) సుందరాచారికి ఫిర్యాదు చేశారు. బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి(Blood bank employee) అసభ్యంగా ప్రవర్తించాడని, తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని పేర్కొన్నారు. ఫిర్యాదు తర్వాత, ప్రిన్సిపాల్ వెంటనే స్పందించి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదికలోని ఫలితాల ఆధారంగా నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవచ్చని వర్గాలు తెలిపాయి.