విద్యార్థుల ఆందోళన.. చెదరగొట్టిన పోలీసులు
ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసిన విద్యార్థిని
యాజమాన్య నిర్లక్ష్యం, సీనియర్ విద్యార్థి
వేధింపులతోనే ఆత్మహత్య: తల్లిదండ్రుల ఆరోపణ
భైంసా, నవంబర్ 21: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో సోమవారం విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం పెర్కిట్ తిరుమలనగర్‌కు చెందిన రవీందర్ దంప తుల కూతురు స్వాతిప్రియ(18) బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల దసరా, దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లివచ్చింది. సోమవారం ఉదయం స్వాతిప్రియ ఉంటు న్న గదిలోని ఇద్దరు సహచర విద్యార్థినులు టిఫిన్ చేసేందుకు వెళ్లి వచ్చేలోపే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం. విద్యార్థిని ఆత్మహత్యతో విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. స్వాతిప్రియ ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థి వేధింపులు, యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిం చారు.
సోమవారం ఉదయం 7.30 గంటలకు ఫోన్లో తమతో మాట్లాడిందన్నారు. ఆ తర్వాత స్వాతి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం ఇచ్చారని వెంటనే తాము విశ్వవిద్యాలయానికి చేరుకున్నా.. ఆలోపే అధికారులు మృతదేహాన్ని అక్కడి నుంచి భైంసాకు తరలిండం వెనుకు ఆంతర్యమేంటని ప్రశ్నించారు. పోలీసులు లోతుగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.
అమ్మా నాన్న క్షమించండి..
స్వాతిప్రియ ఆత్మహత్యకు ముందు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలుస్తున్నది. ఆమె రాసిన ఆరు పేజీల సూసైడ్ నోట్ అందరినీ కలిచివేస్తుంది. అందులో “అమ్మానాన్మ నన్ను క్షమించండి. నా ఫోన్ కాల్ డిటెయిల్స్ చూడకండి. అక్క, తమ్ముడిని బాగా చూసుకోండి. నాన్న స్మోకింగ్ మానేయండి”. అని రాసి ఉంది. “నా అవయవాలను ఎవరికైనా దానం చేయండి. నాకు చనిపోవాలంటే భయమేస్తుంది కానీ నాకు తప్పడం లేదంటూ” పేర్కొనడంతో ఏదో బలమైన కారణమం ఉంటుందని పలువురు అంటున్నారు.