సూర్యాపేట: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ.. కాలేజీ మొత్తానికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ ప్రిన్సిపాల్ చెడు కార్యకలాపాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయ్యారు. ఈ ఘటన సూర్యపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షే గురుకుల మహిళ డిగ్రీ కాళాశాలలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... గురుకుల మహిళ డిగ్రీ కాళాశాల ప్రిన్సిపాల్ శైలజ రాత్రిళ్లు హస్టల్ కేర్ టేకర్ తో కలిసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. మద్యం సేవిస్తున్నారు. ఇదేంటని అడిగినందుకు అమ్మాయిలని కూడా చూడకుండా ప్రిన్సిపాల్ ఇష్టమొచ్చినట్లు అసభ్య పదజాలంలో దూషిస్తూ.. తమను కొడుతుందని విద్యార్థినిలు ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం అమ్మాయిల హాస్టల్ కు తన కొడుకును తీసుకొచ్చిందని, అతను వారం రోజులు ఇక్కడే ఉన్నాడని, అమ్మాయిల హాస్టల్ లో అతనికి ఏం పని అని విద్యార్థినులు ప్రశ్నించారు.
హాస్టల్ గదిలో ఉన్న బీరు సీసాలను విద్యార్థినులు మీడియాకు చూపించారు. తాగిన మత్తులో తమను ఏం చేస్తారోనని భయపడుతున్నట్టు విద్యార్థినులు వాపోయారు. ఏసీటీ మేడం అండతోనే ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. తమపై దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో తమను మానసికంగా, శరీరకంగా వేధింపులకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ శైలజ మాకొద్దంటూ విద్యార్థినులు నిరసనతో రోడ్డెక్కారు.