calender_icon.png 3 April, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు రేణుక మృతి

01-04-2025 12:00:00 AM

వరంగల్ వాసిగా గుర్తింపు 

చర్ల, మార్చి 31 (విజయ క్రాంతి):  చర్ల సరిహద్దు రాష్ట్రమైన చతిస్గడ్ రాష్ట్రం  బిజాపూర్-దంతేవాడా సరిహద్దు ప్రాంతంలో డి ఆర్ జి జవాన్ల కు  మావోయిస్టులకు సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో వరంగల్ నివాసిగా అనుమానిస్తున్న మహిళా మావోయిస్టు రేణుక మృతి చెందింది.  సంఘటన స్థలం నుంచి, మృతదేహంతో పాటు ఇన్సా స్ రైఫిల్, మందుగుండు సామగ్రి, రోజువారీ ఉపయోగించే వస్తువులను భద్రతా బాల గారు స్వాధీన పరుచుకున్నారు. మృతిచెందిన రేణుక పై రూ  25 లక్షల రివార్డ్ ఉంది. దంతేవాడ-బీయిజాపూర్ సరిహద్దు నీల్, ఎకెలి , బెలానార్ ప్రాంతాలలో ఈ ఎ దురు కాల్పులు జరిగాయి . ఈ  కాల్పుల్లో మృతి చెందిన గుమ్మడవెల్లిరేణుక సరస్వతి అలియాస్ దమయంతి, అలియాస్ భాను  డికెఎంసిఎం ర్యాంక్ నాయకురాలు. మరణించిన మావోయిస్టు వరంగల్ నివాసి గా తెలుస్తుంది.