ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచనలు, వ్యాపార మార్గాలను వెతుకుతూ ముందుకుసాగుతున్న సింగరేణి సంస్థ.. మరో అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఆకాశంలో సగమైన మహిళలకు అవకాశాలు కల్పించేందుకు ముందుకుసాగుతోంది. దేశంలోనే మొదటిసారిగా రెండు గనులను మహిళలకు మాత్రమే కేటాయించాలని నిర్ణయించింది. ఒకటి ఓపెన్ కాస్ట్ (ఓసీ) అయితే, మరొకటి అండర్ గ్రౌండ్ మైన్ (యూజీ).
ఇప్పటివరకు దేశంలో ఎక్కడాలేని విధంగా ముందుకుసాగుతోంది. ఇందు లో భాగంగా గనుల్లోనూ మహిళలకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. కేంద్రం ఏయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో మహిళలను రిక్రూట్ చేసుకుంటూ ముం దకుసాగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 33 శాతం మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అమలుచేస్తోంది. ఈ స్ఫూర్తి తో సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగం గా రెండు గనులను మహిళలకే కేటాయించాలనే అడుగులు వేస్తున్నారు.
గోదావరిఖని, భూపాలపల్లిల్లో
ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ గనులు మహిళలకు కాస్త అనుకూలంగా ఉంటా యి. దీనికితోడు ఎక్కువ మంది మహిళలు ఎక్కడెక్కడ కేంద్రీకృతమయ్యారు అనేది కూడా సీఎండీ పరిశీలిస్తున్నారు. మొత్తం సుమారు 16 గనుల బాధ్యతలు మహిళల కు కేటాయించే అవకాశాలున్నాయి. ఇందులోనూ గోదావరి ఖని, భూపాలపల్లి ప్రాంతాల్లో ఉన్న గనులను మహిళలకు కేటాయించనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనే ఎక్కువగా మహిళలు సింగరేణిలో పనిచేస్తున్నారు. అందుకే ఈ రెండు ప్రాంతాల గనులను కేటాయించాలనే ఆలోచనతో సింగరేణి యాజమాన్యం ముందుకువెళుతోంది.
అన్ని విభాగాల్లోకి మహిళలు..
వాస్తవానికి సింగరేణిలో కార్మికుల విభాగం, ఫైనాన్స్ విభాగాల్లోనే మహిళలు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో 33 శాతం మహిళలకు కేటాయించిన నేపథ్యంలో మహిళలకు అవకాశం కల్పించిన ట్టయింది. దీనితో మైనింగ్ ఇంజనీర్లు, ఫిట్ట ర్లు, ఎలక్ట్రీషియన్లు.. ఇలా అన్ని విభాగాల్లో కి మహిళలు పెద్దఎత్తున రిక్రూట్ అయ్యా రు. దాంతో మహిళలు మాత్రమే పనిచేసేలా గనులను కేటాయిస్తే బాగుంటుంద నే ఆలోచనదిశగా సింగరేణి యాజమాన్యం కార్యాచరణ మొదలుపెట్టింది.
ఓపెన్ కాస్ట్‌లో పనిచేయాలంటే సుమా రు 100 నుంచి 120 మంది వరకు అవస రం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలాగే అండర్ గ్రౌండ్ గని అయి తే 200 మంది వరకు అవసరం. ఇలా 600 మంది వరకు మహిళలు అందుబాటులో ఉండటంతో రెండు గనుల బాధ్యత లు నిర్వర్తించే అవకాశాలున్నాయి. ప్రస్తు తం గోదావరిఖని, భూపాలపల్లి ప్రాంతా ల్లో ఎక్కువ మంది మహిళలు పనిచేస్తుండటం మహిళలకు కలిసివచ్చే అంశం. త్వరలోనే మహిళలు శిక్షణ పొంది గనుల నిర్వహణలోకి అడుగుపెట్టబోతున్నారు.