కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన సావితి(26)కు పురిటినొప్పులు రావడంతో మంగళవారం రాత్రి 108 అంబులెన్సకు పోన్ చేయగా అంబులెన్స్ సిబ్బందికి అక్కడికి చేరుకొని ఆమెకి పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో దేవాయిపల్లి గ్రామ సమీపంలో ఆమెకు అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 అంబులెన్స్ లోనే సిబ్బంది సాధారణ ప్రసవం చేసి తల్లి, బిడ్డలను కాపాడారు. రెండవ కాన్పు కావడంతో పండంటి ఆడబిడ్డ జన్మించినది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్యసేవల నిమిత్తం ఏరియా ఆసుపత్రి కామారెడ్డిలో చేర్పించినట్లు సిబ్బంది తెలిపారు.108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి అల్లె సురేష్, పైలెట్ బుక్య కార్తీక్, ఆమె భర్త సాయిలు తదితరులు పాల్గొన్నారు.