calender_icon.png 28 February, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోయగూడెం ఓసిలో ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు సన్మానం

27-02-2025 10:08:14 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో ఎలక్ట్రిషన్స్ గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న ఏగ్రేడ్ ఎలక్ట్రిషన్ లు వెంకట సూర్యనారాయణ రాజు, కుప్పల శ్రీను గురువారం కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ప్రాజెక్ట్ అధికారి గోవిందరావు, మేనేజర్ సౌరబ్ సుమన్ పూలమాల శాలువలతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేశారు. వారు మాట్లాడుతూ...  ఎలక్ట్రిషన్స్ గా భద్రతతో కోయగూడెం ఓపెన్ కాస్ట్ కు వారు చేసిన సేవలను కొనియాడారు.  క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్నలను పొందారన్నారని తెలిపారు. పదవి విరమణ అనేది అనివార్యమని, ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పొందుతారని, వారి జీవితంలో సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం గజ మాలలతో ఎలక్ట్రిషన్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. మవివిధ డిపార్ట్ మెంట్ల  అధికారులు, కుటుంబ సభ్యులు  సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్  శ్రీకాంత్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ నాగశేషు, ఐ ఎన్ టి యూ సి   పిట్ సెక్రటరీ అశోక్ కుమార్, ఏ ఐ టి యూ సి   పిట్ సెక్రటరీ సర్వర్, ఐ ఎం టి యూ సి  డిప్యూటీ జనరల్ సెక్రటరీ భూక్యా నాగేశ్వరావు, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ బాసు, సూరి, చారి, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.