calender_icon.png 14 March, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండ్లగూడలో 100 ఫీట్ల రోడ్లు

13-03-2025 06:01:21 PM

రూ.101 కోట్లతో పనులు

క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ శరత్ చంద్ర 

రాజేంద్రనగర్,(విజయ క్రాంతి): బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్(Bandlaguda Municipal Corporation)లోని పలురోడ్లను 100 ఫీట్ల రహదారులుగా మార్చనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర పేర్కొన్నారు. పెరుగుతున్న వాహనాలకు రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రోడ్లను వెడల్పుగా మారుస్తున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి వయా కిస్మత్ పూర్, బండ్లగూడ, జాగీర్ హెచ్పీ పెట్రోల్ పంప్ జంక్షన్ వరకు 5.5 కిలోమీటర్ల రోడ్డును రూ.66 కోట్లతో  చేపట్టనున్నారు.

అదేవిధంగా వివేకానంద విగ్రహం నుంచి వయా మున్సిపల్ ఆఫీస్, ఎక్సైజ్ అకాడమీ వరకు 2.05 కిలోమీటర్ల  దూరానికి రూ.24.00 కోట్లు మంజూరు అయ్యాయి. దర్గా ఖాలీజ్ ఖాన్ వై జంక్షన్ నుంచి ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వరకు 0.85 కిలోమీటర్ల రోడ్డును కి రూ.11.00 కోట్ల నిధులతో వేయనున్నారు. మొత్తం రూ.101 కోట్లతో హెచ్ ఆర్ డి సి ఎల్  సంస్థ  చేపట్టనున్న రోడ్లు జాయింట్ ఇన్స్పెక్షన్ లో భాగంగా గురువారం కమిషనర్ శరత్ చంద్ర, సి ఈ శ్రీనివాస్, ఈఈ మహబుబ్ మియా, కిషోర్ బాబు, అరవింద్, డిఈఈ తులసి కృష్ణ, ఏఈఈ రాజ్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి  వాణి తదితరులు పరిశీలించారు.