07-04-2025 12:43:37 AM
నాగర్‌కర్నూల్ ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ఎస్‌ఎల్బిసి సొరంగంలో జరిగిన ప్రమాదం లో చిక్కుకున్న కార్మికుల ఆనవాళ్ళ కోసం రెస్క్యూ ఆపరేషన్ పండగ దినాల్లోనూ నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రమాద స్థలి లో నిత్యం నిర్విరామంగా నీటి ఊట బురద పేరుకుపోతుండడంతో 13.800 కి మీ డేంజ ర్ జోన్‌గా గుర్తించి ఏర్పాటు చేసుకున్న రక్ష ణ కంచెను అనుసరించి నిత్యం 20 మీటర్ల మేర మట్టి తొలగింపు ప్రక్రియ జరుగుతుంది.
ప్రస్తుతం పనిచేస్తున్న నాలుగు ఎస్కవేటర్లతో పాటు మరో రెండు అదనపు యంత్రల ద్వారా మట్టి తీత పనులు ముమ్మ రం చేశారు. తీసిన మట్టిని బయటికి తరలించేందుకు కన్వేయర్ బెల్ట్ విస్తరించడం తోపాటు లోకో ట్రైన్ ద్వారా టిబిఎం భాగా లను కత్తిరిస్తూ బయటికి తరలిస్తున్నారు.
నిరంతరాయంగా వస్తున్న ఊట నీటిని అత్యధిక సామర్థ్యం గల మోటార్ పంపుల ద్వారా ఊట నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. ప్రమాదం జరిగి సుమారు 46 రోజు లు కావస్తున్న మరో ఆరుగురి కార్మికుల ఆనవాళ్లు మాత్రం కాన రాలేదు. దీంతో ఎప్పటి కప్పుడు రెస్క్యూ టీం బృందాల నిపుణులతో సమీక్ష సమావేశాలు జరుపుతూ పలు సూచనలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.