వీడియో వైరల్
న్యూఢిల్లీ, జనవరి 11: రుమాల్ రోటీ.. పరిచయం అక్కర్లేని వంటకం. రెస్టారెంట్లు, దాబాల్లో పెద్ద పెనం మీద వీటిని కాలుస్తారు. చాలామంది ఇష్టంగా వీటిని తింటారు. సాధారణంగా రుమాల్ రోటీ రుమాల్ మాదిరిగా రెండు, మూడు ఫీట్ల పొడవు ఉండేలా తయారు చేస్తారు.
కానీ ఓ యువకుడు ఏకంగా 12 అడుగుల రోటీని చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌కు చెందిన ఫుడ్ వ్లాగర్ సోహెబుల్లా యూసఫ్ జాయ్ ఈ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద రోటీ.. 12 అడుగుల పొడవు అంటూ ఈ వీడియోను పంచుకున్నాడు. ఇ ప్పటివరకు 13 కోట్ల మంది ఈ వీడియోను చూశారు.