calender_icon.png 12 December, 2024 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉడకని అన్నం తిన్నందుకే అస్వస్థత

12-12-2024 12:50:50 AM

తాండూరు ట్రైబల్ వెల్ఫేర్ వసతిగృహాన్ని సందర్శించిన కలెక్టర్ 

వికారాబాద్, డిసెంబర్ 11(విజయక్రాంతి): తాండూరు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కావడం బాధాకరమని కలెక్టర్ ప్రతీక్ జైన్ విచారం వ్యక్తం చేశారు. ట్రైబల్ వెల్ఫేర్‌లో ఫుడ్ పాయిజన్‌తో మం గళవారం  పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆస్ప త్రిలో చికిత్స పొందుతుండటంతో కలెక్టర్ బుధవారం హాస్టల్‌ను  సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థిను లతో కలిసి మధ్యాహ్న భోజ నం చేశారు. అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థినులతో మాట్లాడారు.

అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ అన్నం సక్రమంగా ఉడకకపోవడంతోనే విద్యార్థినులు అస్వస్తత కు గురయ్యారని తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్‌లో జరిగిన ఘటనను దాచిపెట్టేందుకు అధికారులు యత్నిస్తున్నారని బీజేపీ నాయకుడు రమేశ్ ఆరోపించారు. కలెక్టర్ వాహ నం ముందు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.