09-02-2025 12:00:00 AM
మలిదశలో ఒంటిరితనం తీవ్ర స్థాయిలో వేధిస్తుంది. అలాంటివారు ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యక్తులను బట్టి వారి మనస్తత్వాలు, అభిప్రాయాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉన్నట్లే ఒంటరితనం కూడా ఉంటుంది. ఒంటరితనం అనేది వ్యక్తుల స్వభావాన్ని బట్టి ఉంటుంది.
ఒకవేళ ఒంటరిగా ఫీలవుతుంటే.. దాన్ని దూరం చేసుకోవడానికి మొదట చేయాల్సిన పని.. మీకు సంతోషాన్ని కలిగించే పనులపై దృష్టి సారించడం. అందులో డ్యాన్స్, వంట, ప్రయాణం లేదా వ్యాయామం వంటి అంశాలు ఉండవచ్చు. దీనివల్ల ఇతరులతో కలిసే అవకాశం దొరుకుతుంది. నలుగురితో మాట్లాడే అవకాశం లభిస్తుంది. ఈ యాక్టివిటీస్ జీవన విధానాన్ని మెరుగుపరచడంతో పాటు ఒంటరితనాన్ని దూరం చేస్తాయి.