calender_icon.png 29 April, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరసంగా అనిపిస్తుందా?

27-04-2025 12:00:00 AM

ప్రతిరోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. నిద్రలేమి చిరాకు, నీరసాన్ని పెంచుతుంది. 

పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు శరీరానికి శక్తినిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే వాటిని తగ్గించడం మంచిది. 

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. శక్తిస్థాయిలు పెరుగుతాయి. నడవడం, యోగా, డ్యాన్స్ లేదా ఇష్టమైన ఏదైనా శారీరక శ్రమ చేయాలి. నీరు తాగడం.. రోజంతా తగినంత నీరు తాగడం చాలా అవసరం. డీహైడ్రేషన్ వల్ల అలసట, చిరాకు వస్తుంది. 

ప్రతికూల ఆలోచనలను తగ్గించుకుని సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం.

ఆనందం కలిగించే అలవాట్లు లేదా పనుల కోసం సమయం కేటాయించడం మన మానసిక స్థిని మెరుగుపరుస్తుంది. 

స్నేహితులు, కుటుంబ సభ్యులతో స మయం గడపటం, ఇతరులతో మాట్లాడటం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం.