calender_icon.png 30 October, 2024 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్బందిగా అనిపించి నో చెప్పా..

11-08-2024 12:05:00 AM

‘పత్తర్ కే పూల్’తో యాక్టింగ్ కెరీర్‌ను ఆరంభించింది సీనియర్ నటి రవీనా టాండన్. కొద్దికాలంగా సహాయ నటి పాత్రల్లోనే కనిపిస్తున్న ఈమె ప్రస్తుతం ‘వెల్‌కమ్ టు ది జంగీల్’లో నటిస్తోంది. అంతకుముందు ఎందరో బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ‘యే లమ్హే జుదాయి కే’, ‘జాదు’, ‘జమానా దివానా’ వంటి చిత్రాల్లో షారుక్ ఖాన్‌తో జత కట్టడం ద్వారా ప్రేక్షకులను అలరించింది రవీనా టాండన్.

వీరిద్దరి కాంబోలో మరో సినిమాకు రంగం సిద్ధమైనప్పటికీ.. ఆ ప్రాజెక్టును తాను రిజెక్ట్ చేశానని ఇటీవల ఓ ఫిల్మ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది రవీనా. ‘షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఓ చిత్రానికి తొలుత నన్నే హీరోయిన్‌గా అడిగారు. స్టోరీ, క్యారెక్టర్ నాకు బాగా నచ్చిన ఆ సినిమాలో నేను ధరించాల్సిన దుస్తుల గురించి ఆ ప్రాజెక్టుకు సంతకం చేసే టైమ్‌లో చిత్రబృందం చెప్పినపుడు షాకయ్యా.

సౌకర్యవంతంగా అనిపించలేదు. ఇది చిన్న విషయమే అయినప్పటికీ ఇబ్బందిగా అనిపించి ఆ ప్రాజెక్టుకు నో చెప్పా. తర్వాత ఈ విషయం తెలిసి షారుక్ ఆశ్చర్యపోయారు. ‘నీకు పిచ్చి పట్టిందా? నో చెప్పాల్సిన అవసరమేముంది?..’ అని ప్రశ్నించారు. కాస్ట్యూమ్స్ వల్లే నేను చేయలేకపోతున్నానని చెప్తే అర్థం చేసుకున్నారు’ అని విషయం బయటపెట్టింది.