నిజాంసాగర్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): నిజాంసాగర్ మండల కేంద్రంలో ఏళ్లుగా నెలకొన్న విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. మండలంలోని అచ్చంపేట, ఆరేడు, బ్రాహ్మణపల్లి, వెల్గనూరు వరకే ఒకే ఫీడర్ ఉండడంతో ఏ గ్రామంలో సమస్య వచ్చినా ఎల్ సి తీసుకునే క్రమంలో మండలంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయవలసి వచ్చేది. నిజాంసాగర్ మండల కేంద్రానికి ప్రత్యేకంగా ఫీడర్ ఏర్పాటు చేయడంతో కరెంట్ కష్టాలు తొలగినట్లయ్యింది.
ఈ నూతన ఫీడర్ ద్వారా మండలంలోని ప్రతీ గ్రామానికి నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యం అవుతుందని అధికారులు తెలిపారు. నూతన ఫీడర్ ప్రారంభం చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు స్థానిక ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, విద్యుత్ లోటు సమస్య నుంచి విముక్తి కలిగిస్తుందని అన్నారు. నూతన ఫీడర్ ప్రారంభం ద్వారా మండల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.