calender_icon.png 7 February, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు రియింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి

07-02-2025 12:26:40 AM

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్

కామారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 6 ( విజయ క్రాంతి): విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొగిలి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రo లో  స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ రాక విద్యార్థులు, ఉపాధ్యాయులు పుస్తకాలను పక్కనపెట్టి పొట్టకూటికోసం పనులలో చేరుతున్నారని ఎక్కడ చూసినా కళాశాలల యజమాన్యాలు అప్పుల్లో కురుక పోయాయి అన్నారు. 

వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. విద్యార్థుల సహనాన్ని పరీక్షించొద్దని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే మరో తెలంగాణ ఉద్యమం లాంటి భీకర ఉద్యమానికి శ్రీకారం చుట్టుతామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పవన్, రాజు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.