calender_icon.png 20 April, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

08-04-2025 12:17:22 AM

కరీంనగర్, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిల విడుదల లేదని  ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజు బకాయిల విడుదల చేయకపోవడానికి ప్రభుత్వంకి ఎందుకంత నిర్లక్ష్యమని అన్నారు.

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడవద్దని అన్నారు. యూనివర్సిటీల భూములను అమ్మాలని చూస్తే ప్రభుత్వంపై తీవ్ర తిరుగుబాటు తప్పదని, ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేస్తే ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులు చేస్తామని  హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, నగర నాయకులు సందీప్ రెడ్డి, అశోక్, పవన్, వినయ్ రెడ్డి, రాజేష్ పాల్గొన్నారు