calender_icon.png 25 November, 2024 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

23-10-2024 01:45:50 AM

యాదాద్రి కలెక్టరేట్‌ను ముట్టడించిన విద్యార్థులు

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ను ముట్టడించారు. బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు పట్టణంలోని వేలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీ మోదీరాందేవ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం బకాయిపడిన రూ.7,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులు వట్టెం మధు, కరుణాకర్‌రెడ్డి, ఎత్తరి చందు, భూక్యా నాయక్, గుణవర్ధన్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.