calender_icon.png 10 January, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

01-08-2024 08:30:00 AM

అసెంబ్లీ ఎదుట పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కా లర్‌షిప్స్ బకాయిలు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎ స్‌యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో బుధవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసుల భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఆయా సంఘాల నాయకులు పలువురు అసెంబ్లీ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పీ మహేశ్, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, కేవలం 7.3 శాతం మాత్రమే కేటాయించారని విమర్శించారు.

నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ పెండింగ్‌లో ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్‌ను ఇస్తామని దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని, ఇది నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. కార్యక్రమంలో నాయకులు పీ కిరణ్, డీ శ్రీకాంత్, జే రాజేశ్వర్, జీ శ్యామ్, మస్తాన్, ధరావత్ రవి, వనమాల సత్యం, కే శ్రీనివాస్, రాణాప్రతాప్, పీ శ్రీనివాస్, ఎస్ పాపయ్య, సంతోశ్, కార్తీక్, సింహాద్రి పాల్గొన్నారు.