* కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ డిమాండ్
* తక్షణమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
* దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు
* జాబ్స్ పొందిన వారికి కేంద్ర మంత్రి సన్మానం
కరీంనగర్, డిసెంబరు 29 (విజయ క్రాంతి) : వచ్చే సంక్రాంతిలోపు ఫీజు రీయంబర్స్‌మెంట్ మెత్తాన్ని చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కిషన్ రెడ్డి ఆధ్వ ర్యంలో సంక్రాంతి తరువాత మహోద్య మాలు చేసి రాష్ర్ట ప్రభుత్వ మెడలు వంచి తీరుతామని అల్టిమేటం జారీ చేశారు. మాట ఇచ్చిన మేరకు కట్టుబడి వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాం డ్ చేశారు.
ఆదివారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ‘దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్’ పేరిట తాను నిర్వహించిన కోచింగ్ సెంటర్ లో చదువుకుని ఉద్యోగాలు పొందిన రాగుల నగేశ్ (జూనియర్ లెక్చరర్), అమర్ నాథ్ యాదవ్ (స్కూల్ అసిస్టెంట్), రాజశేఖర్, వెంకటేశ్ (సీఆర్పీఎఫ్), కార్తీక్, ప్రియాంక (గ్రూప్ 4) లను ఆయన సన్మానించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ హైదరాబాద్ వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకునే స్థోమత లేని నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంవల్లే ఈరోజు ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. అయినా రాష్ర్టంలో నిరుద్యో గ సమస్య తీవ్రంగా ఉందనీ, బిశ్వాల్ కమిటీ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా యని ప్రకటించి 4 ఏళ్లయినా... వాటిని భర్తీ చేయలేదన్నారు.
అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తా మని హామీ ఇచ్చి మాట తప్పిందని, 25 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గప్పాలు కొడుతోందన్నారు. నిరుద్యోగు లకు 4 వేల భ్రుతి ఇస్తామని మాట తప్పిం దని, ఒక్కో నిరుద్యో గికి 48 వేలు బకాయి పడిందని, వెంటనే బకాయిలు ఇవ్వాలని ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలనీ, లేనిపక్షంలో బీజేపీ పక్షాన తీవ్రమైన ఆందోళనలు చేసేందుకు సిద్దమవుతోందన్నారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్‌ను కరీంనగర్‌లోని రేకుర్తి హను మాన్ ఆలయ పరిసరాల్లో సన్మానించారు. ఉద్యోగుల వెంట తను ఎప్పుడూ ఉంటానని, సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షు లు సమర సేన, సెక్రెటరీ జబీ, జాయింట్ సెక్రటరీలు శ్రీకాంత్, చంద్రకళ, పబ్లిసిటీ సెక్రటరీ కిరణ్, కార్యవర్గ సభ్యులు శేఖర్, భాగ్యలక్ష్మి, శ్రావ్య, తదితరులు పాల్గొన్నారు.