28-04-2025 12:10:24 AM
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): విద్యార్థుల ఫీజు రీయిం బర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ రాశా రు. గత మూడేళ్ల ఫీజుల బకాయిలు చెల్లించనందుకు నిరసనగా కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలను బంద్ చేసి పరీక్షలను నిరవధి కంగా వాయిదా వేశారని లేఖలో పేర్కొన్నారు.
ఫలితంగా విద్యార్థుల ఒక విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు బకాయిలు చె ల్లించి విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత చదువులకు ఆటంకాలు కలిగేలా ప్రభు త్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు.
14 లక్షల మంది విద్యార్థులకు రూ. 4వేల కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించేందుకు బడ్జెట్ లేదని సర్కారు బుకాయిస్తోందన్నారు. విదేశీ చదవుల కోసం వెళ్లే విద్యార్థులకు ఇచ్చే ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ బకాయిలు కూడా ఇవ్వనందున అనేక మంది చదువులు మధ్యలో ఆపేసి దేశానికి తిరిగి వస్తున్నారని ఈ అంశంలోనూ సీఎం చొరవ తీసుకునాలని కోరారు.