calender_icon.png 24 February, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి

23-02-2025 11:15:47 PM

విద్యారంగానికి బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలి..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్స్ బకాయిలను విడుదల చేయాలని పీడీఎస్‌యూ జాతీయ నాయకులు పి.మహేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు మంద నవీన్, కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో విద్యానగర్‌లోని మార్క్స్ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డి ప్రబుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ఫీజు బకాయిలను చెల్లించలేదని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాలన్నారు. ప్రైవేటు, కార్పొరేటర్ కాలేజీల్లో ఫీజుల దోపిడీనికి అరికట్టాలని కోరారు. సమావేశంలో పీడీఎస్‌యూ ఓయూ నాయకులు ఆసిఫ్, మౌనిక, గౌతమ్, ఝాన్సీ, జాహ్నవి, రహీం తదితరులు పాల్గొన్నారు.