ప్రజల డాక్టర్‌గా విక్టర్ ఇమ్మానుయేల్
పీర్జాదిగూడ ప్రజల గుండెల్లో గూడు
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 30 (విజయక్రాంతి) : వేలకు వేలు బిల్లు కడితే గానీ వేలు కూడా ముట్టని డాక్టర్లను చూస్తున్న ఈ రోజుల్లో కేవలం ౧౦ రూపాయలకు వైద్యం అందిస్తున్న డాక్టర్ విక్టర్ ఇమ్మానుయేల్ గురించి.. ఆయన మాటల్లోనే... ‘మా నాన్న భారత సైన్యంలో సిఫాయిగా పనిచేసేవారు. మా అమ్మ అనారోగ్యంతో చికిత్సపొందుతూ మరణించింది. అప్పుడు నాకు మూడేండ్లు. మెరుగైన వైద్యం అందక మా అమ్మ చనిపోయిందని నాన్న బాధపడేవారు. అప్పుడే నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. మాజీ సైనికుల కోటా మధ్యప్రదేశ్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశా. కేరళలో జనరల్ మెడిసిన్‌లో పీజీ చేశా.
ఆ సమయంలో తన భర్తను కాపాడుకోవడా నికి హాస్పిటల్ ఫీజు కోసం తన కుమారుడితో కలిసి బిక్షాటన చేయడం.. తమిళ నాడులోని సీఎఫ్ చారిటీ దవాఖానలో రూ.5లకే వైద్యం అందించడం నా బాధ్యతను గుర్తు చేశాయి. తక్కువ ఫీజుతో పేదలకు వైద్యం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఇంటినే ‘ప్రజ్వల’ పేరుతో దవాఖానగా మార్చాను.’ అని చెప్పుకొచ్చారు. డాక్టర్ ఇమ్మానుయేల్‌కు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా విజయక్రాంతి తరపున హ్యాట్సాఫ్.