నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బుధవార్పేట్ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ సభ్యులు సోమవారం స్కూల్ ఫీజులను చెల్లించారు. మొత్తం ఐదు మంది విద్యార్థులకు ఈ ఫీజులను చెల్లించినట్లు లైన్స్ క్లబ్ నిర్వాహకులు మోహన్ రెడ్డి, గంగారెడ్డి, నరసయ్య తదితరులు తెలిపారు.