calender_icon.png 3 March, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజుల దోపిడీని అడ్డుకోవాలి

02-03-2025 12:29:57 AM

జీ స్కూల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

ఎల్బీనగర్, మార్చి 1: హయత్‌నగర్‌లోని జీ స్కూల్ యజమాన్యం ఫీజులను భారీగా పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం హయత్‌నగర్‌లోని జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. జీ స్కూల్ యజమాన్యం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం ముందు ఒక ఫీజు చెప్పి, విద్యాసంవత్సరం ముగింపులో ఫీజులను భారీగా పెంచారని ఆరోపించారు.

ఒక్కసారిగా 30 నుంచి 40శాతం ఫీజులను పెంచారని తెలిపారు. దీంతో రూ.20 నుంచి రూ.30 వేలు అదనంగా చెల్లించాల్సి వస్తుందన్నారు. ఫీజుల పెంపులపై ప్రభుత్వ నియంత్ర చర్యలు తీసుకోవాలని కోరారు. పేరుకు జీ స్కూల్ హయత్‌నగర్‌లో ఉన్నా భువనగిరి జిల్లా రెవెన్యూ పరిధిలో ఉంటుందని, జిల్లాలో ఉండాల్సిన ఫీజులు హైదరాబాద్ స్థాయిలో పెంచారని వివరించారు. జీ స్కూల్ యజమాన్యంపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.