విడుదల చేస్తామన్న ప్రభుత్వం: టీపీడీఎంఏ
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): డిసెంబర్ 10వ తేదీలోపు ఫీజు బకాయిలు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చినట్లు తెలంగాణ పీజీ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం (టీపీడీఎంఏ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించేంత వరకు కళాశాలలు బంద్ చేస్తామని, పరీక్షలు నిర్వహించబోమని ప్రైవేట్ కాలేజీలు గతంలో ప్రకటించి, ఆ ప్రకటనను విరమించుకున్న సంగతి తెలిసిందే.
అయితే డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి సూచనల మేరకు యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలు యథావిధిగా నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సంఘం తెలిపింది.