రాజ్యసభ్య సభ్యుడు ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, జనవరి 1 (విజయక్రాం తి): రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.4 వేల కోట్ల ఫీజు బకాయిలను రాష్ట్రప్రభుత్వం వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, బీసీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్‌తో కలిసి ఆదివారం ఓయూ ఆర్ట్స్ కాలే జీ వద్ద నిర్వహించనున్న మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. బీసీ హాస్ట ళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు.
ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీ, ఇం టర్మీడియట్ తదితర కాలేజీల్లో చదివే బీసీ, ఈబీసీ విద్యార్థుల పూర్తి ఫీజులు విడుదల చేయాలన్నారు. కాలేజీలో చదువుతున్న ప్రతి బీసీ విద్యార్థికీ సంవత్సరానికి రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్ అందజేయాలన్నారు. విదేశీ విద్య కోసం విద్యార్థులకు రూ.20 ల క్షల చొప్పున ఉపకార వేతనం అందజేయాలన్నారు.
ఐఐటీ, ఐఐఎం కోర్సులు చదివే వారికి ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం అమ లు చేయాలన్నారు. బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్ ను రూ.200 కోట్లకు పెంచాలన్నారు. అన్ని ఉద్యోగ పోటీ పరీక్షలకు బీసీ విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలన్నారు. కోచింగ్ సమయంలో నెలకు రూ. 5 వేల ఉపకార వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీసీ విద్యార్థుల సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలన్నారు.భారీ బహిరంగ సభకు విద్యార్థులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, బొక్క వెంకటయ్య, వీరన్న, రవి యాదవ్, ఉదయ్ నేత, రాజు నేత, ప్రసాద్, వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.