- జనవరి 3న ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి
- ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, డిసెంబర్ 26: (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న రూ. 4వేల కోట్ల విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విద్యా ర్థులకు ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనవరి ౩న చలో కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడికి సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. అనంత రం మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల స్కాలర్‌షిప్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడా నికి జనవరి 3న కార్యాలయాల ముట్టడికి పిలుపునిచినట్టు తెలిపారు.
ఏడా ది పాలనలో కాంట్రాక్టర్‌లకు ఎంత చెల్లించారు? ఇతర బిల్లులు ఎన్ని చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశా రు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, అంజి, బీసీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ వెంకటేశ్, రాజేందర్, రాంకోటి, లింగ న్న, రఘుపతి, రాందేవ్ మోడీ, ఉమేష్, రమేశ్, ఈశ్వర్ పాల్గొన్నారు.