కేరళలోని అలువా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేటు రంగ ఫెడరల్ బ్యాంక్ ఇన్‌వర్డ్ రెమిటెన్సులకు ప్రసిద్ధి. దేశంలోకి ప్రవాసులు పంపించే మొత్తం రెమి టెన్సుల్లో ఐదవ వంతుకుపైగా ఫెడరల్ బ్యాంక్ ద్వారానే వస్తాయి. ప్రపంచవ్యాప్తం గా 110 బ్యాంక్‌లు, ఎక్సేంజ్ కంపెనీలతో ఫెడరల్ బ్యాంక్‌కు రెమిటెన్స్ ఏర్పాట్లు ఉన్నా యి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి ఫెడరల్ బ్యాంక్ ద్వారా రెమిటెన్సులు వస్తుంటాయి.
93 ఏండ్ల చరిత్ర
ఫెడరల్ బ్యాంక్‌ను కేరళలో ట్రావెంకోర్ కంపెనీల చట్టం కింద 1031లో తిరువళ్లలో రూ. 5,000 మూలధనంతో ట్రా వెంకోర్ ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్‌గా నెలకొల్పారు. కేవలం వ్యవ సాయ, పరిశ్రమలకు సంబంధించిన బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే ట్రావెంకోర్ ఫెడరల్ బ్యాంక్‌ను 1949లో బ్యాంకర్ అయిన కేపీ హోర్మిస్ టేకోవర్ చేసి 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం కింద ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్‌గా పేరు మార్చారు.
1963 మధ్యకాలంలో పలు చిన్న బ్యాంక్‌లను టేకోవర్ చేసి ఫెడరల్ బ్యాంక్ మరింతగా విస్తరించింది. 1970లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ హోదాను పొందిన తర్వాత వాణిజ్య బ్యాంకింగ్ కార్యకలాపాల్ని ప్రారంభించింది. 2994లో తొలి పబ్లిక్ ఇష్యూను జారీచేసిన ఫెడరల్ బ్యాంక్ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టయ్యింది.
రూ.47,028 కోట్ల మార్కెట్ విలువ
స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.47,028 కోట్లు. ప్రైవేటు బ్యాంక్‌ల్లో ఆస్తుల్లోనే కాకుండా మార్కెట్ విలువలో సైతం ఫెడరల్ బ్యాంక్ ఎనిమిదవ స్థానంలో ఉన్నది. ఈ షేరు గత మూడేండ్లలో 91 శాతంపైగా రాబడిని ఇచ్చింది.
1,545 శాఖలు.. రూ.3.08 లక్షల కోట్ల ఆస్తులు
ఫెడరల్ బ్యాంక్‌కు 2024 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 1,542 శాఖలు ఉన్నాయి. 2,045 పైగా ఏటీఎంలను నిర్వహిస్తున్నది. అబుదాభి, దుబాయ్‌ల్లో ప్రాతి నిధ్య కార్యాలయాలను ఏర్పాటు చేసింది. 2024 మార్చి నాటికి ఈ బ్యాంక్‌లో 14,658 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫెడరల్ బ్యాంక్ ఆస్తుల పరిమా ణం తాజా గణాంకాల ప్రకారం రూ. 3,08,311 కోట్లు.
ఆస్తుల రీత్యా ప్రైవేటు బ్యాంక్‌ల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌ల తర్వాత ఫెడరల్ బ్యాంక్ 8వ స్థానంలో ఉన్నది. ఫెడరల్ బ్యాంక్‌కు ప్రస్తుతం కేవీఎస్ మణియన్ ఎండీ, సీఈవోగా వ్యవ హరిస్తున్నారు.