calender_icon.png 21 October, 2024 | 8:34 PM

త్వరలో ఫెడ్ వడ్డీ రేట్ల కోత

18-07-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, జూలై 17: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ జూలై సమీక్ష నుంచే వడ్డీ రేట్ల కోతకు శ్రీకారం చుడుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. ఈ 30,31 తేదీల నాటి సమీక్షలో 25 బేసిస్ పాయింట్ల (పావుశాతం) మేర ఫెడ్ ఫండ్స్ రేటును తగ్గిస్తుందని, 2024లో 50 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకూ రేట్ల లో కోత పెడుతుందని అంచనా వేసింది.

రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడం, జాబ్ మార్కెట్ బలహీనపడినందున రేట్ల కోత అనివార్యమని మూడీస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిట ఫండ్స్ రేటును ప్రస్తుత 5.25 5.50 శాతం వద్దే జూలై సమీక్షలో అట్టిపెడితే, జాబ్ మార్కెట్ మరింత బలహీనప డుతుందని, దాంతో సెప్టెంబర్ సమీక్షలో ఒకేదఫా 50 బేసిస్ పాయింట్లు (అరశాతం) తగ్గించే అవకాశాలుంటాయని మూడీస్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాధవి బొకిల్ చెప్పారు.