calender_icon.png 29 September, 2024 | 4:52 AM

ఫెడ్ రేటు అర శాతం కోత

19-09-2024 12:00:00 AM

నాలుగేండ్ల తర్వాత తొలిసారిగా వడ్డీ రేట్లను తగ్గించిన 

యూఎస్ కేంద్ర బ్యాంక్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ప్రపంచమం తా ఆతృతగా వేచిచూస్తున్న యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం బుధవారం రాత్రి వెలువడింది. ఫెడ్ ఫండ్స్ రేటును అరశాతం తగ్గించింది. ప్రస్తుతం 5.25 శాతం వద్దనున్న ఈ రేటు 4,75 శాతానికి తగ్గుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వో ఎంసీ) రెండు రోజుల సమావేశం అనంతరం ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్  నిర్ణ యాన్ని ప్రకటించారు. ఫెడ్ ఫండ్స్ రేటు అనేది వాణిజ్య బ్యాంక్‌లకు ఫెడ్ ఇచ్చే నిధులపై వసూలు చేసే రేటు.

ఈ రేటు ఆధారంగానే యూఎస్ బ్యాంక్‌లు వాటి రుణగ్రహీతలు తీసుకునే డబ్బుకు రేట్లను నిర్ణయిస్తారు. ఎఫ్‌వోఎంసీ వడ్డీ రేటు నిర్ణ యం తీసుకోవడంతో పాటు భవిష్యత్తు లో రేట్ల మార్పులపై సంకేతాల్ని వెల్లడించింది. ఈ సంకేతాల ఆధారంగా రానున్న త్రైమాసికాల్లో ఫెడ్ రేట్ల బాటపై ఇన్వెస్టర్లు అంచనాల్ని ఏర్పర్చుకుంటారు. అమెరికాలో ద్రవ్యోల్బణం 3 శాతం దిగువుకు తగ్గడం, వృద్ధి మందగించడంతో ఈ సెప్టెంబర్ మీట్‌లో రేట్లను తగ్గించనున్నట్లు ఫెడ్ చైర్మన్ గత నెలలోనే సూచనా ప్రాయంగా చెప్పారు. కొవిడ్ సంక్షోభం ముగిసిన తర్వాతర ఫెడ్ జీరో శాతం నుంచి వరుసగా రేట్లను పెంచుకుంటూ పోయింది. 2020 తర్వాత ఫెడ్ రేట్లను తగ్గించడం ఇదే ప్రధమం.