calender_icon.png 28 December, 2024 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫెడ్ ఎఫెక్ట్: పెరిగిన బంగారం

09-11-2024 01:42:20 AM

హైదరాబాద్‌లో రూ.910 ఎగిసిన తులం ధర

హైదరాబాద్, నవంబర్ 8: అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ విజయంతో పతనమైన బంగారం ధర తిరిగి కొంతవరకూ కోలుకున్నది. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర గురువారం రాత్రి 30 డాలర్ల మేర పెరిగింది. దీనితో  దేశీయ మార్కెట్లో నూ ఎగిసింది.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారె ట్ల తులం బంగారం ధర రూ. 910 పెరిగి రూ. రూ.79,480 వద్దకు చేరిం ది. క్రితం రోజు ఇది రూ.1,790 మేర తగ్గిన సంగతి తెలిసిందే. తాజాగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.850 ఎగిసి 72,850 వద్ద నిలిచింది.ఫెడరల్ రిజ ర్వ్ గురువారంనాటి సమీక్షా సమావేశంలో ఫెడ్ ఫండ్స్ రేటును 0.25 శాతం తగ్గించింది. వరుసగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండోసారి.