20-02-2025 03:39:44 PM
హైదరాబాద్: ప్రజా పంపిణీ, ఫిబ్రవరి నెలకు గాను 20 తేది గురువారం వరకు ఉందని పౌర సరఫరాలశాఖ(Civil Supplies Department) ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ తెలిపారు.లబ్ధి దారులు ఎవరైనా ఏవైనా కారణాలతో ఇప్పటికీ రేషన్ తీసుకోని వారు ఉంటే. ఫిబ్రవరి 20 వరకు తీసుకోవచ్చని రఘు నందన్ వెల్లడించారు. పోర్టబిలిటి సౌకర్యంతో తమ కు నచ్చిన చోట రేషన్(Ration) తీసుకోవచ్చని రఘునందన్ వివరించారు. డీలర్లు గనక షాపులు తెరచి ఉంచక పోతే స్థానిక తాశిల్డార్ కు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజా పంపిణీ కి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 వరకు ఉండగా దాన్ని 18 వరకు పొడిగించారు. కాగా తాజాగా ఇవాళ, ఈ గడువు కొన్ని జిల్లాలకు అవసరం రీత్యా మరో 2 రోజులు పెంచారు. దీంతో రేషన్ తీసుకునే అవకాశం ఫిబ్రవరి 20 వరకు ఉంది.