calender_icon.png 27 December, 2024 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిబ్రవరి 7.. దుల్లకొట్టేద్దాం

06-11-2024 12:00:00 AM

అల్లు అరవింద్ సమర్పణ లో- నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వాలెంటైన్స్ డేకి ముందు సినిమా రిలీజ్ కావడం, సీజన్‌లోని రొమాంటిక్ మూడ్‌ను క్యాపిటిలైజ్ చేసుకునే మంచి అవకాశంగా చిత్ర బృందం భావిస్తోంది. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో చందూ మొండేటి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో నాగ చైతన్య మాట్లాడుతూ.. “ఒక యాక్టర్ కి రిలీజ్ డేట్ ఎప్పుడు అని తెలుసుకోవాలని ఉంటుంది. అరవింద్ గారిని రిలీజ్ డేట్ గురించి అడిగాను. ఆయన ‘ముందు సినిమా చూపించండి. 

నేను అనుకున్న సినిమా అక్కడ కనిపిస్తే రిలీజ్ డేట్ చెప్తాను’ అన్నారు. ఆ మాట ఆయన అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫిబ్రవరి7 తేదీ నాకు చాలా సంతోషాన్నిస్తోంది. ఫిబ్రవరి 7.. దుల్లకొట్టేద్దాం” అన్నారు.

సాయి పల్లవి మాట్లాడుతూ.. “గీత ఆర్ట్స్ అల్లు అరవింద్,  బన్నీ వాస్ నాకు ఎలాంటి అవార్డు వచ్చినా, నా సినిమా విజయమైనా ఎంతగానో గౌరవించి, సన్మానిస్తారు.  ఒక కూతురులా చూసుకుంటారు. దానికి నేను థాంక్యూ తప్ప ఇంకేం చెప్పలేదు.  మంచి కంటెంట్ ఎప్పుడు వస్తుందో జనాలకి అప్పుడు నచ్చేస్తుంది.

ఫిబ్రవరి 7న ఈ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా బ్యూటిఫుల్ డేట్ అది” అని పేర్కొన్నారు. నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. “తండేల్ సినిమాను తీసుకెళ్లి 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెడతాం. దానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అక్కినేని అభిమానులందరికీ చెబుతున్నాను.

మంచి షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళండి మంచి షర్టు కొనుక్కోండి. కాలర్ ని బాగా ఐరన్ చేయించండి. ఫిబ్రవరి 7 మార్నింగ్ షో చూసిన తర్వాత మీ కాలర్ ఎత్తుతారు” అన్నారు. డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ.. “అల్లు అరవింద్ గారి లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ అన్ని చూసే డేట్ వేస్తారు. బిలీవ్ మీ.. అరవింద్ గారు ఏదైతే డేట్ ఇచ్చారో.. ఈ సినిమాకి ది బెస్ట్ రెవెన్యూ, నెంబర్స్ మనం చూస్తా” అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “తండేల్ రిలీజ్ డేట్ చెప్పడం మాకు ఎంతో ప్రత్యేకం. అందుకే మీ అందరి సమక్షంలో ఒక వేడుకలా రిలీజ్ డేట్ ని రివిల్ చేస్తున్నాం. ఫస్ట్ హాఫ్ చూశాను. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కూడా చెబుతాను అన్నాను.

అప్పటివరకు డేట్ చెప్పకూడదని అనుకున్నాను. రెండు రోజుల క్రితం సెకండ్ హాఫ్ చూశాను. డేట్ పెట్టేద్దామని అన్నాను. ఫిబ్రవరి 7 వేస్తే.. 14 ఫిబ్రవరి ఇంపార్టెన్స్ మనకు తెలుసు. అక్కడికి పీక్‌లో ఉంటుంది” అన్నారు.