calender_icon.png 8 January, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూకబ్జా బాగోతాలతోనే భయం

06-01-2025 12:00:00 AM

  1. బీఆర్‌ఎస్ పాలనలో ప్రతి పథకంలో స్కాములే 
  2. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

సిరిసిల్ల, జనవరి 5 (విజయక్రాంతి): ఒక్కొక్కటిగా భూకబ్జాల బాగోతం బయటప డడంతో కేటీఆర్ భయపడుతున్నాడని వే ములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో ఆయన నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్రెడ్డి తో కలిసి విలేకరుల సమా వేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సిరిసిల్లలో శనివారం కేటీఆర్ అసహనంతోనే మీడియా సమా వేశం నిర్వహించారని, ఒక వైపు గంభీరంగా మాట్లడుతూనే మరోవైపు  లోపల భయపడుతున్నారన్నారు. కేటీఆర్ మీడియా తో మాట్లాడిన బిఆర్‌ఎస్ భవన్ కూడ కబ్జా కు గురైందేనని, మీకు ప్రభుత్వం ఇచ్చిన భూ మి ఎంత మీ బిఆర్‌ఎస్ భవన్ కట్టిన భూమి ఎంత అని ప్రశ్నించారు.

మీ బిఆర్‌ఎస్ భవన్ కబ్జాకు గురైందో లేదో మీ గుండె మీద చేతులు వేసుకొని ప్రజలకు చెప్పాలన్నారు. ఇప్పటికే కొంత మంది ప్రభుత్వ భూమలను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని, మీరు ప్రైమ్ టైమ్ లోకేషన్ లో ఎకరాకు 2 కోట్లు, 3కోట్లు, 50 లక్షలు పలికే భూముల ను కబ్జా చేశారని ఆరోపించారు.

జంగ్ బూ ములు, సిపాయి భూములు, పోరంబోకు, పంచరాయి, శికం, లావుని పట్ట, దేవాలయ, ప్రభుత్వ భూములను సైతం వదలకుండా కబ్జా చేశారన్నారు. సుమారు 1000 ఎకరా లు కబ్జా చేస్తే మా ప్రభుత్వం ఇప్పటికే పావ లా వరకు భూమి స్వాధీనం చేసుకుంద న్నారు. సిరిసిల్ల చుట్టూ పక్కలా ఇంత భూ మి కబ్జా చేస్తే,హైదరాబాద్ పట్టణ చుట్టు పక్కల ఇంకెంత భూమి కబ్జా చేశారో అని అన్నారు.

ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈడీ, ఐటీ నోటీసులు ఇస్తే మొట్టమొదలు లాయ ర్‌ను మాట్లాడుకుంది నువ్వు కాదా అని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్  హయాంలో కాలే శ్వరం, సుందిళ్ల, టెలిఫోన్ గ్యాపింగ్ వంటి అనేక అక్రమాలకు పాల్పడడంతోపాటు  గోర్లు, బర్లు, చేపలు ప్రతి పథకంలో స్కాము లు చేసిన ఘనత మీదేనన్నారు.

టెలిఫోన్ ట్యాపింగ్ చెసి సినీ తారలు, జడ్జిలు వేముల వాడలో నా మాటలు కూడా విన్నారని అన్నారు. చట్టం తన పని తను చేసుకపోతే ఎందుకు భయ పడుతున్నారని అన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై  ఇతరులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతే ఊరుకునేది లేదన్నారు.

కేటీఆర్ మాట్లాతు నేను రాసుకుంటున్న అంటున్నానని, అధికారంలోకి వచ్చినంక వడ్డీతో తిరిగి ఇస్తా మని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని అన్నారు. మీ తాటకు చప్పులకు భయపడే వారు ఎవరూ ఇక్కడ ఎవరూ లేరన్నారు. మీలాగా మీ అనుచరుల లాగా మా నాయ కులు ఎక్కడా కూడా కబ్జాలో చేయడం లేదన్నారు.

అసలు బిఆర్‌ఎస్ నాయకుడు దేశ పౌరుడు కానీ వారిని కుర్చీలో కూర్చో బెట్టిన ఘనత మీదేనన్నారు. మొన్నటి రోజున అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మో హన్ సింగ్ సంతాప తీర్మానం ప్రవేశ పెడు తున్నాం సభకు రావలసిందిగా  స్పీకర్ కెసిఆర్‌కు స్వయానా ఫోన్ చేస్తే ఎందుకు రాలేదని అన్నారు.

నాలుగుసార్లు సమా వేశం నిర్వహిస్తే ఏదో చుక్క తెగిపడ్డట్లుగా ఒకసారి వచ్చారని, ప్రజా సమస్యలపై మాట్లాడిన లేవన్నారు. సభకు ఒక్కసారి కూడా రాకుంటే అనరత వేటు పడుతుందనే ఒకసారి వచ్చారని అన్నారు. మీ సూచనలు సలహాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినా గానీ కెసిఆర్ సభకు రావడం లేదన్నారు.

అరులైన వారికి రైతు భరోసా ఇస్తున్నామని,అసెంబ్లీలో చర్చించి విధివిధానాలను ఖరారు చేయడం జరిగింద న్నారు. రాళ్ళకు రప్పలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇవ్వడం లేదన్నారు. కేవలం వ్యవసాయం చేసుకునే వారికే  ఇస్తు న్నామన్నారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని,కేటీఆర్ చిటికీ మాటికి మా నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు.

మీ హయాంలో చా లా కుంభకోణాలు జరిగాయి కాబట్టే విచా రణ చేస్తున్నామన్నారు. తప్పు చేసినవారికి చట్ట పరంగా చర్యలు ఉంటాయాన్నారు. పేదవారి జోలికి ప్రభుత్వం పోదు.కొత్తగా కవిత బిసి నినాదాన్ని ఎత్తుకోవడం విడ్డూ రంగా ఉందన్నారు. ఈ సమావేశంలో కాం గెస్ నాయకులు పాల్గొన్నారు.