కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల
కరీంనగర్, సెప్టెంబరు 4 (విజయక్రాంతి): గ్రానైట్ సంస్థకు సంబంధించి వందల కోట్ల డ్యూటీ ఎగవేసినందుకు నమోదైన ఈడీ కేసుల నుంచి బయటపడే ందుకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హో ంశాఖ మంత్రి అమిత్‌షా వద్ద పొర్లు దండలు పెడుతున్నారని కా ంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ఆ రోపించారు.
బుధవారం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రజలు వర్షాలతో అవస్థలు పడుతుంటే అ వేం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరి ంచడం త గదన్నారు. భూ క బ్జాలకు కారణమైన బీఆర్‌ఎస్ నేతలపై ఖమ్మంలో క డుపు మ ండిన బాధితులు దాడి చేస్తే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం తగదని మండిపడ్డారు. కరీంనగర్ జి ల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ రాబోతుందని, బీఆర్‌ఎస్ నేతలు చేసిన భూ కబ్జాలకు మూ ల్యం చెల్లించుకోవడం ఖాయమన్నారు.