calender_icon.png 23 October, 2024 | 1:47 PM

భయపడవద్దు: భట్టి

02-09-2024 02:56:16 AM

ఖమ్మం, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : ఖమ్మం జిల్లాలో వరదల బీభత్సం నేపథ్యంలో రాష్ట్ర ఉప  ముఖ్యమంత్రి, మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులే టి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వరద ప్రాంతాల్లో పర్యటించి, సహాయ చర్యలను పర్యవేక్షించారు. మున్నేరు బ్రిడ్జి, ప్రకాశ్‌నగర్ వంతె న, నగరంలో వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, సహాయ కార్యక్రమాలు చేపట్టేలా అధికారులను అప్రమత్తం చేశారు. వరద ల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు విశాఖ నుంచి హెలికాప్టర్‌ను తెప్పిస్తున్నారు. వరదల్లో చిక్కుకుని, సహాయం కోసం ఎదు రుచూస్తున్న వారందర్నీ కాపాడాలని మల్లు భట్టి విక్రమార్క  అధికారులను ఆదేశించారు. 

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారితో  ఫోన్లో మాట్లాడి, సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. వీలైనన్ని పునరావాస కేంద్రాలు ఏర్పా టు చేసి, బాధితులకు భోజన, వసతి సౌకర్యాలను  ఏర్పాటు చేయాలని అధికారుల ను ఆదేశించారు.  ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అవసరమైన  యంత్రాలు, సామగ్రిని, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ను ఆదేశించా రు.

కరీంనగర్ పర్యటను అర్ధాంతరంగా ము గించుకుని హుటాహుటిన ఖమ్మం బయలుదేరి వచ్చిన భట్టి విక్రమార్క  రాత్రికి రాత్రి మధిర చేరుకుని, పరిస్ధితిని సమీక్షించారు. అర్ధరాత్రి వంగవీడు వెళ్లి, అక్కడ నుంచి బుగ్గవాగు వద్దకు చేరుకుని వరద నీటిలో చిక్కు కున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని కాపాడారు. ప్రజలు భయపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భట్టి పేర్కొన్నా రు. హైదారాబాద్‌లో వాతావరణం సరిగా లేనందున విశాఖ నుంచి హెలికాప్టర్ తెప్పిస్తున్నట్లు తెలిపారు. 

కఠిన పరిస్థితుల్లోనూ.. 

కఠిన వాతావరణ పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి అన్నా రు. ఆదివారం వర్షంలో విద్యుత్ మరమ్మతులు చేస్తున్న విద్యుత్ ఉద్యోగుల వీడియోను టీజీఎస్‌పీడీసీఎల్ ట్వీట్ షేర్ చేయగా.. భట్టి రీట్వీట్ చేశారు. ఈ విపత్తుల వేళ.. ప్రతిఒక్కరూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. వర్షంలోనూ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, అధికా రులను అభినందించారు.