28-04-2025 12:13:57 PM
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైనికాధికారుల్లో భారత్ తో యుద్ధ భయం కనిపిస్తోంది. దీంతో సైనికాధికారులు కుటుంబసభ్యులను దేశం దాటిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్(Pakistan Army Chief Asim Munir) కుటుంబం ఇప్పటికే కనిపించకుండా పోయింది. దేశం విడిచి పారిపోయారంటూ స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. పహల్గాం దాడి తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించలేదు. ఆయన కూడా విదేశాలకు వెళ్లిపోయారని కనిపించకుండా పోయారు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది అద్నాన్ డార్ ఇల్లును భద్రతా బలగాలు నేల మట్టం చేశారు. బలగాలు నేడు గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. జమ్ము కాశ్మీర్ లో పోలీసులున్నారు.. సీఆర్పీఎఫ్ బలగాలు భారీగా మోహరించాయి. గ్రామస్తులను ఇప్పటికే వేరే ప్రాంతాలకు తరలించారు. గ్రామంలో ప్రతీ ఇంటిని ఆర్మీ అధికారులు జల్లెడ పడుతున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి కోసం అటవీ మార్గాలను ఉగ్రవాదులు ఎంచుకున్నారు. కోకెర్నాగ్ అటవీ ప్రాంతంలో 22 గంటలు ట్రెక్కింగ్ చేశారు. కొండలు ఎక్కి బైసరన్ వ్యాలీకి చేరుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ఆరు రోజులుగా అనంతనాగ్ అడవుల్లో ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్లను ఉపయోగించినట్లు తెలుస్తోతంది. స్మగ్లింగ్ చేసిన హువాయ్ కంపెనీకి చెందిన శాటిలైట్ ఫోన్ వాడినట్లు గుర్తించారు. పహల్గామ్ ఉగ్రవాదులు ప్రస్తుతం పిర్ పంజాబ్ అడువుల్లో దాక్కున్నారు. ఎల్ఓసీ నుంచి సరిహద్దు దాటలని ఉగ్రవాదులు చూస్తున్నారు. వందల మంది భారత సైనికులు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.