calender_icon.png 22 September, 2024 | 10:12 PM

ఎఫ్‌డీఆర్ పనులు చేయలేం!

20-09-2024 12:00:00 AM

చేతులెత్తేసిన చిరు కాంట్రాక్టర్లు

600 మందికి బకాయిలు రూ.67 కోట్లు

డిపాజిట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి

కరీంనగర్, సెప్టెంబరు 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు కరీంనగర్ జిల్లాతోపాటు పలు జిల్లాల్లో పంట నష్టంతోపాటు రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉండగా, ఈ ఎఫ్‌డీఆర్ పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. రాష్ట్రానికి సంబంధించి రూ.10 లక్షలలోపు పనులు చేసిన 600 మంది కాంట్రాక్టర్లకు రూ.67 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.

తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్‌లో సమావేశమై ఈ మేరకు ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు లేఖను అందించాలని నిర్ణయించారు. ఎఫ్‌డీఆర్‌తోపాటు ఏఎం (ఆన్యువల్ మె యింటనెన్స్) పనులు చిన్న కాంట్రాక్టర్లు చేపడుతుంటారు. వీరికి రెండేళ్లుగా పేమెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయలేని పరిస్థితులు ఉంటే మళ్లీ టెండర్లు పిలవడమేంటని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో పనికి 2.50 శాతం డిపా జిట్ల రూపంలో ప్రభుత్వం సేకరిస్తుంది.

ఇలా 600 పనులకు సంబంధించి రూ.13 కోట్ల వరకు డిపాజిట్ చేసిన సొమ్మును కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉన్నారా? అని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు కొప్పుల అజయ్‌కుమార్, ప్రెసిడెంట్ దర్శనాల శంకరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల మోహన్ ఈ సందర్భంగా ఈఎన్‌సీ ఎదుట తమ ఆవేదనను వెళ్లగక్కారు. చేసిన పనుల బిల్లులు, మేం కట్టిన డిపాజిట్లు ఇవ్వడం లేదని, వెంటనే నిధులను విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. 

రెండేళ్లుగా బిల్లులు పెండింగ్

రెండు సంవత్సరాలుగా బిల్లులు పెండిం గ్ ఉండటం వల్ల కొత్త పనులు చేయలేకోతున్నామని, రోడ్డున పడి చివరకు బిక్షమె త్తుకునే పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని చిన్న కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాము ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. వీరు స్పందించిన అనంతరం ఫైలు ఈఎన్‌సీ వద్దకు వస్తుందని, నిధులు విడుదల చేస్తే కొత్త పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటున్నారు.

వీరి సంగతి ఇలా ఉంటే కరీంనగర్ నగరపాలక సంస్థలో సీఎం హామీ పథకం కింద గత దసరా సందర్భంలో చేపట్టిన అత్యవసర పనులకు సం బంధించి లక్షలాది రూపాయల బిల్లులు పెం డింగ్‌లో ఉండటంతో చిరు కాంట్రాక్టర్లు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తు తం ఎఫ్‌డీఆర్ పనులే కాకుండా కరీంనగర్ నగరపాలక సంస్థతోపాటు జిల్లా పరిధిలోని ౪ మున్సిపాలిటీల్లో టెండర్లున పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. పెద్ద కాంటాక్టర్లు కోటి నుంచి ఆపై పనులు చేసిన వారికి బిల్లు లు చెల్లింపు కొనసాగుతుండగా, చిరు కాం ట్రాక్టర్లను ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈఎన్‌సీ వద్ద ఉన్న ఫైలు కదిలితేనే వీరి పేమెంట్స్ జరుగుతాయి.