న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ ప్రధమార్థంలో దేశంలోకి విదే శీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ లు) 45 శాతం వృద్ధిచెంది 29.79 బిలియన్ డాలర్లకు చేరాయి. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం సర్వీసులు, కంప్యూటర్, టెలికాం, ఫార్మా రంగాలు అధిక ఎఫ్‌డీఐలను ఆకర్షించాయి.
నిరుడు ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో 20.5 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన ఆరునెలల కాలంలో మారిషస్, సింగపూర్, యూఎస్, నెదర్లాండ్స్, యూఏఈ, కేమాన్ ఐలెండ్స్, సైప్రస్ దేశాల నుంచి వచ్చిన ఎఫ్‌డీఐలు పెరగ్గా, జపాన్, యూకేల నుంచి వచ్చిన పెట్టుబడులు తగ్గాయి.