calender_icon.png 27 December, 2024 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంతో చిత్రపరిశ్రమ భేేటీపై తప్పుడు ప్రచారం: దిల్ రాజు

26-12-2024 06:47:01 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం చాలా బాగా జరిగిందని సినీ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. చిత్రపరిశ్రమ పట్ల సీఎం సానుకూలంగా ఉన్నారని, రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ సమావేశంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని దిల్ రాజు మండిపడ్డారు. ఈ సమావేశంలో సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు అంశం ప్రస్తావనకే రాలేదని, ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధే అన్నారు. డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోలు భేటీలో ప్రదర్శించలేదని తెలిపారు. సమావేశంలో జరగనివి జరిగినట్లు వార్తలు వస్తున్నాయని దిల్ రాజు ఆగ్రహాం వ్యక్తం చేశారు. హాలీవుడ్ చిత్రాలు హైదరాబాద్ లో ఘూటింగ్ జరిగేలా అభివృద్ధి చేద్దామని, నగరానికి ఐటీ, ఫార్మా, సినీ పరిశ్రమలు కీలకమని ముఖ్యమంత్రి అన్నారని దిల్ రాజు స్పష్టం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సెలబ్రిటీలు పాల్గొన్నాలని, గద్దర్ అవార్డులు ఎఫ్డీసీతో అనుసంధానంగా జరగాలని సీఎం చెప్పారని దిల్ రాజు వెల్లడించారు.